Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-telugu-page-1

Page 1

ੴ ਸਤਿ ਨਾਮੁ ਕਰਤਾ ਪੁਰਖੁ ਨਿਰਭਉ ਨਿਰਵੈਰੁ ਅਕਾਲ ਮੂਰਤਿ ਅਜੂਨੀ ਸੈਭੰ ਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥ ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు అతనే 'శాశ్వత మైన ఉనికి'. అతనే విశ్వాన్ని సృష్టించిన కర్త, అంతటా-ఉండే, భయం లేకుండా, శత్రుత్వం లేకుండా, కాలం నుండి స్వతంత్రంగా, జనన మరియు మరణ చక్రాలకి మించి మరియు స్వీయ బహిర్గతుడు. గురువు కృపవల్ల ఆయన సాక్షాత్కారం చెందబడ్డాడు.
॥ ਜਪੁ ॥ ఈ కూర్పు యొక్క పేరు 'జాప్'
ਆਦਿ ਸਚੁ ਜੁਗਾਦਿ ਸਚੁ ॥ అతను మొదటి నుండే ఉనికిలో ఉన్నాడు, యగాలంతా నిజంగానే.
ਹੈ ਭੀ ਸਚੁ ਨਾਨਕ ਹੋਸੀ ਭੀ ਸਚੁ ॥੧॥ ఓ' నానక్, అతను ఇప్పుడు నిజమైనవాడు, అతను ఎప్పటికీ నిజమైనవాడే (ఉనికిలో ఉంటాడు).
ਸੋਚੈ ਸੋਚਿ ਨ ਹੋਵਈ ਜੇ ਸੋਚੀ ਲਖ ਵਾਰ ॥ ఒకవేళ ఎవరన్నా వేలాది స్నానాలు చేసినా మనస్సు స్వచ్ఛంగా మారదు.
ਚੁਪੈ ਚੁਪ ਨ ਹੋਵਈ ਜੇ ਲਾਇ ਰਹਾ ਲਿਵ ਤਾਰ ॥ నిరంతరం ఆచారబద్ధమైన ధ్యానం చేసినా కూడా మనస్సు మౌనంగా ఉండి తిరగటాన్ని ఆపదు.
ਭੁਖਿਆ ਭੁਖ ਨ ਉਤਰੀ ਜੇ ਬੰਨਾ ਪੁਰੀਆ ਭਾਰ ॥ అన్ని గ్రహాల భౌతిక సంపదను సేకరించైనా తర్వాత కూడా ఆకలి లేదా భౌతిక సంపద కోసం కలిగే కోరికను సంతృప్తి పరచలేదు.
ਸਹਸ ਸਿਆਣਪਾ ਲਖ ਹੋਹਿ ਤ ਇਕ ਨ ਚਲੈ ਨਾਲਿ ॥ అత్యంత తెలివి మరియు జ్ఞానం కలిగి ఉండటంతో చివరికి వచ్చే ప్రయోజనం ఏమి ఉండదు.
ਕਿਵ ਸਚਿਆਰਾ ਹੋਈਐ ਕਿਵ ਕੂੜੈ ਤੁਟੈ ਪਾਲਿ ॥ కాబట్టి మన౦ సత్య౦గా ఎలా మారవచ్చు? భ్రమ యొక్క ముసుగును (దేవుని నుండి మనల్ని వేరు చేసేది) ఎలా చీల్చెయ్యవచ్చు?
ਹੁਕਮਿ ਰਜਾਈ ਚਲਣਾ ਨਾਨਕ ਲਿਖਿਆ ਨਾਲਿ ॥੧॥ ఓ నానక్, మీకు నిర్దేశించినదాన్ని అంగీకరిస్తూ మరియు దేవుని చిత్తం ప్రకారం జీవించడం ద్వారా.
ਹੁਕਮੀ ਹੋਵਨਿ ਆਕਾਰ ਹੁਕਮੁ ਨ ਕਹਿਆ ਜਾਈ ॥ ప్రతిదీ అతని ఆదేశం తోనే సృష్టించబడింది; అతని ఆజ్ఞను వివరించలేము.
ਹੁਕਮੀ ਹੋਵਨਿ ਜੀਅ ਹੁਕਮਿ ਮਿਲੈ ਵਡਿਆਈ ॥ అతని ఆజ్ఞతో ఆత్మలు జీవాన్ని పూసుకుంటాయి; ఆయన ఆజ్ఞతోనే మహిమ, గొప్పతనము లభిస్తాయి.
ਹੁਕਮੀ ਉਤਮੁ ਨੀਚੁ ਹੁਕਮਿ ਲਿਖਿ ਦੁਖ ਸੁਖ ਪਾਈਅਹਿ ॥ అతని సంకల్పంతో కొందరు ఉన్నతంగా మరికొందరు తక్కువ నిలుస్తారు. ఆయన సంకల్పంతోనే నిర్దేశించిన దాని వల్ల బాధలు, ఆనందాలు అనుభవిస్తారు.
ਇਕਨਾ ਹੁਕਮੀ ਬਖਸੀਸ ਇਕਿ ਹੁਕਮੀ ਸਦਾ ਭਵਾਈਅਹਿ ॥ కొందరు, ఆయన ఆజ్ఞతో, ఆశీర్వదింపబడి మరియు క్షమించబడతారు; మరికొ౦దరు, ఆయన ఆజ్ఞతో, జనన మరణాల చక్ర౦లో లక్ష్యాలు లేకుండా తిరుగుతారు ఉంటారు.
ਹੁਕਮੈ ਅੰਦਰਿ ਸਭੁ ਕੋ ਬਾਹਰਿ ਹੁਕਮ ਨ ਕੋਇ ॥ ప్రతి ఒక్కరూ ఆయన ఆజ్ఞకు లోబడి ఉంటారు; ఎవరూ ఆయన ఆజ్ఞను దాటి లేరు.
ਨਾਨਕ ਹੁਕਮੈ ਜੇ ਬੁਝੈ ਤ ਹਉਮੈ ਕਹੈ ਨ ਕੋਇ ॥੨॥ ఓ నానక్, అతని ఆజ్ఞను ఎవరైతే అర్థం చేసుకుంటారో, వారు అహంభావ౦తో ప్రవర్తి౦చకూడదు.
ਗਾਵੈ ਕੋ ਤਾਣੁ ਹੋਵੈ ਕਿਸੈ ਤਾਣੁ ॥ అతని సామర్థ్య౦ ప్రకార౦, కొ౦దరు ఆయన శక్తిని పాడుతూ ఉండొచ్చు.
ਗਾਵੈ ਕੋ ਦਾਤਿ ਜਾਣੈ ਨੀਸਾਣੁ ॥ కొ౦దరు ఆయన మనకు ఇచ్చే బహుమతుల గురి౦చి పాడుతారు (మన౦ వినియోగి౦చినవన్నీ) మరియు ఆ బహుమతులను చూసుకుని ఆయన ఉన్నారనే రుజువు చేసుకుంటారు.
ਗਾਵੈ ਕੋ ਗੁਣ ਵਡਿਆਈਆ ਚਾਰ ॥ కొందరు ఆయన ఉదాత్తమైన సద్గుణాలను మరియు ఆయన గొప్పతనాన్ని పాడుతారు.
ਗਾਵੈ ਕੋ ਵਿਦਿਆ ਵਿਖਮੁ ਵੀਚਾਰੁ ॥ కొ౦దరు ఆయన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పాడడ౦ కష్ట౦గా ఉ౦టు౦దని అనుకుంటారు.
ਗਾਵੈ ਕੋ ਸਾਜਿ ਕਰੇ ਤਨੁ ਖੇਹ ॥ కొందరు అతను శరీరాన్ని అందంగా తయారు చేస్తాడని, మళ్ళీ దానిని ధూళిగా మార్చేస్తాడని పాడుతారు.
ਗਾਵੈ ਕੋ ਜੀਅ ਲੈ ਫਿਰਿ ਦੇਹ ॥ కొ౦దరు ఆయన ప్రాణాలను తీసేస్తాడని, ఆ తర్వాత మళ్ళీ పట్టిస్తాడని పాడుతారు.
ਗਾਵੈ ਕੋ ਜਾਪੈ ਦਿਸੈ ਦੂਰਿ ॥ అతను చాలా దూరంలో ఉంటాడని కొందరు పాడుతారు.


© 2017 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top